Header Banner

ఏపీలో రేషన్ కార్డుల గడువుపై సర్కార్ కీలక ప్రకటన! భారీ ఊరట!

  Thu May 22, 2025 17:45        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ, మార్పులు, చేర్పుల ప్రక్రియను మరింత అందుబాటులోకి తీసుకొచ్చింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఇకపై రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు ఉండదని ప్రకటించారు. అర్హత ఉన్న వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కొత్త రైస్ కార్డులు దరఖాస్తు చేసిన వారందరికీ 21 రోజుల్లోపు ఉచితంగా కార్డులు జారీ చేస్తామని మంత్రి చెప్పారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మే 7 నుంచి మార్పులు, చేర్పులు చేపట్టినట్లు పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఇది జరగకపోవడంతో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించి, సాంకేతిక లోపాల కారణంగా అసౌకర్యం కలిగినందుకు క్షమాపణ తెలిపారు. ఇప్పటివరకు ఐదు లక్షల దరఖాస్తులు అందగా, ఆరు లక్షల మందికి కొత్త కార్డులు, నాలుగు లక్షల మందికి కార్డు తొలగింపు, అడ్రస్ మార్పుల కోసం దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు.

 

ఈకేవైసీ ప్రక్రియలో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. 4.24 కోట్ల మందికి ఈకేవైసీ పూర్తయ్యిందని, మిగిలినవారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రేషన్ కార్డులకు మ్యారెజ్ సర్టిఫికేట్, ఫోటో అవసరం లేదని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయడం, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్పులు, ఇతర రాష్ట్రాల్లో ఉండే వ్యక్తుల కార్డుల తొలగింపులు వంటి విషయాల్లో కూడా సులభతరం చేశారు. ట్రాన్స్‌జెండర్స్‌కు కూడా అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాలకు డేటాను అనుసంధానం చేసి, ప్రజలకు స్మార్ట్ రైస్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

 

ఇక ప్రతి నెల 5వ తేదీలోపు వృద్ధులు, వికలాంగులకు ఇంటివద్దకే రేషన్ అందించాలని డీలర్లను ఆదేశించారు. రేషన్ షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి చేస్తూ, ఎండీయూ వాహనాలను తొలగించడం వల్ల రేషన్ మాఫియాను అరికట్టినట్లు వివరించారు. డీలర్ల ద్వారా కస్టమర్లకు మర్యాదపూర్వక సేవలు అందేలా వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తక్కువ తూకం ఇవ్వడం, ఎక్కువ ధరలు వసూలు చేసే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్డుదారులకు సౌకర్యవంతమైన రేషన్ పంపిణీ కోసం వ్యూహాత్మకంగా పని చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

 

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!



టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!



అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!

 

పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!




విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..

 

అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!




ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 



   #AndhraPravasi #APGovt #RationCardUpdate #BigRelief #NoDeadline #APNews #ManoharAnnouncement